
ఓ వ్యక్తికి రాత్రికి రాత్రే అదృష్టం కలసి వచ్చింది. మెగా మిలియన్స్ లాటరీ టికెట్ అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన వ్యక్తిని బిలియనీర్ ను చేసింది. ఆ వ్యక్తి ఏకంగా 13 వేల కోట్ల రూపాయిలను గెలుచుకున్నాడు. అయితే మొత్తం సొమ్ముకు అతడికి అందుతుందా? ఏమైనా పన్నులు చెల్లించాలా? చివరకు అతడి చేతికి ఎంత దక్కనుంది? వంటి విషయాలు తెలుసుకుందాం..
అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్‌లో నివసిస్తున్న వ్యక్తికి 1.58 బిలియన్ల లాటరీ వచ్చింది. దీని విలువ భారతీయ కరెన్సీలో 13 వేల 082 కోట్ల కంటే ఎక్కువ నగదును లాటరీ ద్వారా బహుమతి పొందాడు. ఇది లాటరీ చరిత్రలో అతి పెద్ద జాక్ పాట్ .
ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తికి కోట్లాది రూపాయల లాటరీ తగిలింది. మెగా మిలియన్ జాక్పాట్లో అతడు రూ.13 వేల కోట్లు గెలుచుకున్నాడు. జాక్‌పాట్ తీసిన డ్రాలో పవర్‌బాల్ గేమ్ కింద 13, 19, 20, 32, 33 నంబర్లు సరిపోలాయి. ఇందులో గోల్డ్ మెగా బాల్ నంబర్ 14 కూడా ఉంది. టాక్స్ మినహాయించిన తరువాత 6 వేల 269 కోట్ల రూపాయిలు వస్తాయి.
మెగా మిలియన్స్ లాటరీ టికెట్ ను 2 డాలర్లతో ( రూ. 165) కొనుగోలు చేశాడు. అయితే ఇందులో గెలిచే అవకాశాలు చాలా తక్కువుగా ఉంటాయి. 30 కోట్ల మంది ఈ లాటరీ టికెట్ ను కొనుగోలు చేస్తే ఒకరు మాత్రమే గెలుచుకోగలరు. నలభై ఏళ్లుగా లాటరీ విక్రయాలు జరుపుతున్న మెగా మిలియన్స్ జాక్‌పాట్.. 2023 ఏడాదిలో తొలి లాటరీ నిర్వహించింది. అందులో ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తికి కోట్లాది రూపాయల లాటరీ తగిలింది. విజేతకు మొత్తం సొమ్మును లాటరీ నిర్వాహకులు30 వాయిదాల్లో చెల్లిస్తారు. అలా కాకుండా.. మొత్తం ఒకేసారి కావాలంటే లాటరీ మొత్తాన్ని తగ్గించి సుమారు రూ.5వేల కోట్లు ఇస్తారు. అందులో అతడు ఫెడరల్ ట్యాక్స్ కింద కేంద్ర ప్రభుత్వానికి 24 శాతం పన్ను చెల్లించాలి. అతడు ఏ రాష్ట్రంలో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడో.. అక్కడి నిబంధనల ప్రకారం స్టేట్ ట్యాక్స్ కట్టాలి.