మెగాస్టార్ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తూ ఇప్పటికే రూ. 300 కోట్లపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇంకా థియేటర్లో సక్సెస్ ఫుల్గా రన్ అవుతూ మెగా ఫ్యాన్స్ను ఆకర్షిస్తోంది.
ఈ క్రమంలోనే, చిత్ర బృందం ‘శశిరేఖ’ ఫుల్ వీడియో సాంగ్ను విడుదల చేసింది. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన మెలోడియస్ ట్యూన్ కి భీమ్స్, మధుప్రియ తమదైన శైలిలో పాడారు. అనంత శ్రీరామ్ క్రేజీ లిరిక్స్ అందించారు.
చిరంజీవి ‘శంకరవరప్రసాద్’ పాత్రలో, నయనతార ‘శశిరేఖ’ పాత్రలో, సన్నివేశాలను సరదాగా వివరిస్తూ, లిరికల్ వీడియో సుమారు 44 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఫుల్ వీడియో సాంగ్ రాబడే వ్యూస్ ఇంకా రికార్డులను చెరిపేస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
‘‘శశిరేఖ.. ఓ మాట చెప్పాలి.. చెప్పాక.. ఫీలు కాక’’.. ‘‘ఓ ప్రసాద్.. మొహమాటం లేకుండా చెప్పేసేయ్ ఏమి కాదు..’’ అంటూ అనంత శ్రీరామ్ క్రేజీ లిరిక్స్ ఆకట్టుకున్నాయి. త్వరలో ఈ ప్రాజెక్ట్ నుంచి మరిన్ని వీడియో సాంగ్స్ రానున్నాయి.
ఈ సినిమాని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించి మంచి లాభాలు పొందారు. అంతేకాదు సినిమాను కొన్న డిస్ట్రీబ్యూటర్స్ సైతం సేఫ్ జోన్ లో ఉండటం విశేషం.
