మన ఊరు–మన బడి...  టెండర్ఎందుకు రద్దు చేశారు

మన ఊరు–మన బడి...  టెండర్ఎందుకు రద్దు చేశారు
  • వివరణ కోరుతూ రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: మన ఊరు – మన బడి కార్యక్రమం కింద టెబుల్స్, బెంచీల సప్లయ్‌‌ కోసం ఇచ్చిన టెండర్‌‌ను ఎందుకు రద్దు చేశారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర విద్య, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్, ఆ సంస్థ చీఫ్‌‌ ఇంజినీర్, టెండర్ల కమిషనర్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌‌, చర్లపల్లి జైలు సూపరింటెండెంట్స్‌‌కు నోటీసులు జారీ చేసింది. విచారణను జూన్‌‌కు వాయిదా వేసింది. టెండర్‌‌కు పిలిచి ఏకపక్షంగా రద్దు చేశారంటూ హైదరాబాద్‌‌కు చెందిన చింతామణి పరస్వంత్‌‌ ఎంటర్‌‌ ప్రైజెస్‌‌ వెకేషన్‌‌ కోర్టులో ఇటీవల పిటిషన్‌‌ దాఖలు చేసింది.

గవర్నమెంట్‌‌కు రూ.2.95 కోట్లను గ్యారెంటీ కూడా సమర్పించామని, ఏ కారణం చెప్పకుండా టెండర్‌‌ను రద్దు చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని పిటిషనర్‌‌ కోరారు. కౌంటర్‌‌ కాపీలను పరిశీలించాకే తగిన ఉత్తర్వులు ఇవ్వగలమని స్పష్టం చేసిన హైకోర్టు.. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.