జైపూర్, వెలుగు: గుప్త నిధుల కోసం తవ్వకాలకు పాల్పడుతున్న 10 మందిని మంచిర్యాల జిల్లాపోలీసులు అరెస్ట్‌చేశారు. ఎస్ఐ శ్రీధర్ తెలిపిన ప్రకారం.. జైపూర్ మండలం ఇందారంలో సత్యనారాయణ హోటల్ నిర్వహించే సాంబయ్య ఇంట్లో ఆదివారం తెల్లవారుజాము గుప్తనిధులు తవ్వకాలు చేపడుతున్నారనే సమాచారం పోలీసులకు అందడంతో వెళ్లి దాడి చేశారు. తవ్వకాలు చేపడుతున్న గ్రామానికి చెందిన వెన్న రాజేశ్, వెన్న వెంకటి, కాళ్ల కొమురయ్య, బద్దెల ప్రసాద్, వెన్న కుమార్, శ్రీరాంపూర్ ఆర్కే –6కు చెందిన ఐలయ్య, ఆసిఫాబాద్‌జిల్లా రెబ్బెన మండలం సోనాపూర్ కు చెందిన కొమురం గంగు, అర్క భీమ్, శ్రీరాం తిరుపతి, శ్రీరాం రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. గ్రామానికి చెందిన రాజేశ్, కుమార్ గుప్తనిధుల తవ్వకాలపై చేపట్టినట్లు వివరించారు. నిందితులతో పాటు గడ్డపారలు, తట్ట, పార స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.