ప్రేమ ఒకే..పెళ్లి మాత్రం నో..

ప్రేమ ఒకే..పెళ్లి మాత్రం నో..

నువ్వంటే నాకిష్టం. నువ్వు లేనిది నేను లేను. నువ్వే నా లోకం. నువ్వు కాదంటే నేను బతకలేను అంటూ ఆమె ప్రేమ కోసం పరితపించాడు. ఆమె వెంట తిరిగాడు. నువ్వు లేకుండా  బతకలేనని నమ్మబలికాడు. పెళ్లి చేసుకుంటానని బాసలు చేశాడు. అతడి మాయ మాటలు నమ్మి  మనసిచ్చింది. అతడితో ఏడు అడుగులు నడిచేందుకు సిద్ధమైంది. కానీ ఆ మోసగాడు  మాత్రం ఆమెను టైంపాస్ గానే భావించాడు. ప్రేమ ముసుగులో ఆమెను లోబర్చుకున్నాడు. అమ్మాయి మాత్రం కేటుగాడి మోసాన్ని  గ్రహించలేకపోయింది. అలా కొన్నాళ్లు గడిచియాయి.. ఈలోగా పెళ్లి చేసుకుందామని అమ్మాయి అడిగే సరికి..రేపు మాపు అంటూ కాలం గడిపేస్తూ వచ్చాడు.  చివరకు విసిగిపోయిన సదరు యువతి.. అతగాడిని గట్టిగా నిలదీసింది. దీంతో  పెళ్లి చేసుకోనని ఖరాకండిగా చెప్పేశాడు. మోసపోయానని గ్రహించిన యువతి.....చివరకు ప్రాణం తీసుకుంది.. 

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని సంషీర్ నగర్ కు చెందిన సోయం తేజశ్రీ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. నెన్నల్ మండలం లంబాడీతండాకు చెందిన దరావత్ రాజ్ కుమార్ అనే యువకుడు ప్రేమించి మోసం చేశాడని సూసైడ్ నోట్ రాసింది బాధితురాలు. పెళ్లి చేసుకుంటానని రాజ్ కుమార్ మోసం చేశాడని వీడియోలో తెలిపింది. పురుగుల మందు తాగుతూ సెల్పీ వీడియా తీసుకుంది. మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. తన బిడ్డ చావుకు కారణమైన రాజ్ కుమార్, అతని కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.