
మంచు లక్ష్మీ ప్రసన్న లీడ్ రోల్‌లో వంశీ కృష్ణ మల్లా దర్శకుడిగా మోహన్ బాబు నిర్మించిన చిత్రం ‘దక్ష’. సెప్టెంబర్ 19న సినిమా విడుదల కానుంది. తాజాగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
అతిథిగా హాజరైన మంచు మనోజ్ మాట్లాడుతూ ‘అక్క, నాన్న కలిసి నటించిన ఈ సినిమాను ప్రేక్షకులు పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. ఈ సినిమా కోసం అక్క చాలా కష్టపడింది. ఈ నెల మూవీ లవర్స్‌కు ఫీస్ట్ లా ఉంటుంది. అన్ని సినిమాలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. మన తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు.
మంచు లక్ష్మి మాట్లాడుతూ ‘దక్ష కథను నా దగ్గరకు నాన్న గారు తీసుకొచ్చారు. ఆయనే ఈ కథను తీసుకొచ్చారా అనేది మొదట్లో నమ్మలేకపోయాను. ప్రతి చిత్రంతో మనకొక సొంత టీమ్ తయారవుతుంది. మహేశ్, జెమినీ సురేష్ వంటి కో ఆర్టిస్టులతో మాకొక కొత్త టీమ్ ఫార్మ్ అయ్యింది.
ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటించాను. నాన్న గారి ఇమేజ్‌కు తగ్గ పర్ఫెక్ట్ క్యారెక్టర్ చేశారు. ఈ చిత్రాన్ని నైజాంలో మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. కన్నప్ప, మిరాయ్ సినిమాలను కూడా మైత్రి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మా ‘దక్ష’ సినిమాతో మైత్రికి హ్యాట్రిక్ అవ్వాలని" మంచు లక్ష్మి చెప్పారు. ఇదొక డిఫరెంట్ థ్రిల్లర్, అందరికీ నచ్చుతుందని దర్శకుడు వంశీ కృష్ణ అన్నాడు.