ఫ్యాన్స్కు సర్ ప్రైజ్ ఇచ్చిన మంచు మనోజ్

ఫ్యాన్స్కు సర్ ప్రైజ్ ఇచ్చిన మంచు మనోజ్

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే తాజాగా తన కొత్త సినిమా ప్రకటిస్తూ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు. మనోజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'వాట్ ది ఫిష్'. ''మనం మనం బరంపురం'' అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి వరుణ్ దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను మనోజ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

ఈ పోస్టర్ మనోజ్ యూనివర్శల్ లుక్ తో ఆకట్టుకుంది. పోస్టర్ తోనే మూవీ థీమ్ ఏంటనది చెప్పేశారు. చుట్టూ భయంకరమైన విదేశీ గూండాలు డాన్ లు కనిపిస్తుంటే.. అందరినీ ఎదుర్కోవటానికి సిద్ధమవుతున్న హీరో పిడికిలి బిగించి బ్యాక్ ఫీట్ లో కనిపించాడు. ఇందులో యాక్షన్ సీన్స్ ను రొటీన్ గా కాకుండా కాస్త వెరైటీగా డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ పోస్టర్ లో గాగుల్ మాస్క్ తో ఉన్న ఒ అమ్మాయి కూడా కనిపిస్తోంది. కాగా, ఈ సినిమాలో నటిస్తున్న మిగతా నటీనటులు, సాంకేతిక విభాగం గురించిన తెలియాల్సివుంది.

‘నేను సినిమా చేసి చాలా రోజులైంది.. కానీ ఇన్నాళ్లూ నేను మీ అందరి ప్రేమను కలిగి ఉండేలా ఆశీర్వదించబడ్డాను. మీ ప్రేమను తిరిగి ఇచ్చే సమయం వచ్చింది. నా కొత్త సినిమా ప్రకటిస్తున్నా. మీ అందరకీ క్రేజీ అనుభవాన్ని అందించే క్రేజీ సినిమా WhatThe Fish’ అని మనోజ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇపుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.