అణచివేయాలనుకుంటే ప్రతిఘటిస్తం

అణచివేయాలనుకుంటే ప్రతిఘటిస్తం

ఎస్సీ వర్గీకరణ అంశంలో జూలై ఒకటి లోపు ఏదో ఒకటి తేల్చాలని ఎమ్మార్పీఎస్ జాతీయాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ అంశంపై కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ లు బాధ్యతను తీసుకొని ఒప్పించాలన్నారు. గతంలో వీరు వర్గీకరణ అంశంలో ఏ విధంగా మాట్లాడారో గుర్తు తెచ్చుకోవాలని..ఒకవేళ వాటిని మర్చిపోతే ఆ రికార్డులను మీడియా ముందు పెడతామని తెలిపారు. వర్గీకరణ అంశంలో సానుకూల ప్రకటన రాకపోతే జరుగబోయే పరిణామాలకు ఈ ముగ్గురే బాధ్యత వహించాలని తేల్చి చెప్పారు.

2న రహదారుల దిగ్బంధం చేస్తామన్న ఆయన..3న ఎమ్మార్పీఎస్ కార్యాలయం నుండి ఇందిరాపార్క్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని మందకృష్ణ మాదిగ తెలిపారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్య బద్ధంగానే ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చామని..మమ్మల్ని అణచివేయడానికి ప్రయత్నిస్తే 100 రూపాల్లో ప్రతిఘటిస్తామని చెప్పారు. 2014లో ప్రధాని అభ్యర్థిగా ఉన్నప్పుడు మోడీ అడగకపోయిన కలిశారని..కానీ పదవిని అధిష్ఠించిన తర్వాత కలిసే అవకాశమే ఇవ్వడం లేదన్నారు. మోడీ హోదాలో మార్పులు వచ్చాయి కానీ తమ జీవితాలలో రాలేదని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే ఎంతటివారైనా ఎదిరిస్తామని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు.