మాదిగలపై కేసీఆర్​ వివక్ష .. బీఆర్ఎస్ మంత్రివర్గంలో ఒక్క మాదిగ కూడా లేరు: మందకృష్ణ

మాదిగలపై కేసీఆర్​ వివక్ష .. బీఆర్ఎస్ మంత్రివర్గంలో ఒక్క మాదిగ కూడా లేరు: మందకృష్ణ

మెదక్/గజ్వేల్, వెలుగు : సీఎం కేసీఆర్​కు మాదిగల మీద వివక్ష ఉందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కళాకారుల్లో నూటికి 90 మంది మాదిగలేనని ఆయన పేర్కొన్నారు. శనివారం మెదక్, సిద్దిపేట్  జిల్లా గజ్వేల్ లో నిర్వహించిన మాదిగల విశ్వరూప మహాసభ సన్నాహాక సమావేశాల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్​ హామీ ఇచ్చారని, ఆ హామీని నెరవేర్చకుండా మోసం చేశారని ఆయన ఫైర్  అయ్యారు.

కేసీఆర్​ మంత్రి వర్గంలో ఒక్క మాదిగ కూడా లేకపోవడం దారుణమన్నారు. నవంబర్ 18న నిర్వహించే మాదిగల విశ్వరూప మహాసభను విజయవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చిన పార్టీకే తాము కూడా సపోర్టు చేస్తామని మందకృష్ణ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో  ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల నాయకులు యాదగిరి, నాగభూషణం, శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.