వారంలో పరిషత్ ఎన్నికల షెడ్యూల్

వారంలో పరిషత్ ఎన్నికల షెడ్యూల్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు ముగియడంతో ఇకస్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది.లోక్ సభ ఎన్నికల కోడ్ మే 28తో ముగియ నుంది.ఆలోగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే జిల్లా, మండల పరిషత్‌ , మున్సిపల్‌‌‌‌ ఎన్నికలను లోక్ సభ ఎన్నికల కోడ్‌‌‌‌ ముగిసే లోపునిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌‌‌‌ను కోరింది.పరిషత్​ ఎన్నికలకు ఈసీ గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇవ్వగా.. మున్సిపల్‌‌‌‌ ఎన్నికలకు త్వరలోనే అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 13, 14 తేదీల్లో జిల్లా, మండలప రిషత్‌ ఎన్నికల రిటర్నింగ్‌‌‌‌ అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం శిక్షణ ఇవ్వనుంది. ఈ నెల 15న రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో ఎన్నికల కమిషనర్‌‌‌‌ నాగిరెడ్డి సమావేశం కానున్నారు. 18న కలెక్టర్లు,ఎస్పీలతో సమావేశం కావాలని ఇప్పటికే నిర్ణయించారు. జిల్లా ఉన్నతాధికారులతో సమావేశంలో ఎన్నికల తేదీలపై స్పష్టత వచ్చే అవకాశముంది. మూడు విడతల్లో రాష్ట్రంలో 32 జిల్లా పరిషత్‌ లు, 535 మండల పరిషత్‌ లకు ఎన్నికలు నిర్వహించ నున్నారు. వారం రోజుల్లోగా షెడ్యూల్‌‌‌‌ విడుదల చేసి ఈనెల 23న తొలి విడత పోలింగ్‌‌‌‌కు నోటిఫికేషన్‌‌‌‌ విడుదల చేసే అవకాశమున్నట్టు సమాచారం.

వరుస కోడ్ .. పాలనకు ఇబ్బందులు

గత ఏడాది సెప్టెంబర్‌‌‌‌ 6 నుంచి రాష్ట్రం లో అసెంబ్లీ ఎన్ని కలకోడ్ .. అటు తర్వాత పంచాయతీ ఎన్నికల కోడ్ .. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల కోడ్ .. ఇలా వరుసగా కోడ్ లు వస్తూనే ఉన్నాయి. కోడ్ వల్ల పాలనపరమైన కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నా యని, లోక్ సభ ఎన్ని కల కోడ్ముగిసే లోపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌‌‌‌ను కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌‌‌‌ జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలు మే 20లోగా పూర్తిచేసేందుకు అనుమతినివ్వాలని కోరుతూ మార్చి13, 22 తేదీల్లో కేంద్ర ప్రధాన ఎన్ని కల కమిషనర్‌‌‌‌కు లేఖ రాసింది. పరిషత్‌ ఎన్నికలకు సీఈసీ అనుమతినిచ్చింది. లోక్ సభ ఎన్నికల కోడ్‌‌‌‌ ముగిసి న తర్వాతేఫలితాలు వెల్లడించాలని స్పష్టం చేసింది. మున్సిపల్ఎన్ని కలకు త్వరలోనే అనుమతి లభించే అవకాశంఉంది. మున్సి‘పోల్స్​’ను మే చివరిలోపు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. మున్సిపల్‌‌‌‌ పాలకవర్గాల పదవీకాలం జూన్‌‌‌‌తో ముగియనుంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.