
కోల్‌బెల్ట్, వెలుగు: ఉద్యోగులు, వారి కుటుంబాల సంక్షేమానికి సింగరేణి యాజమాన్యం కృషి చేస్తోందని సంస్థ మందమర్రి ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం మందమర్రిలోని తన ఆఫీస్‌లో పర్సనల్డిపార్ట్మెంట్రివ్యూ మీటింగ్నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల గైర్హాజరు శాతం తగ్గితే బొగ్గు ఉత్పత్తి పెరుగుతుందన్నారు. అనంతరం హెల్త్‌కార్డులు, ఇతర అంశాలపై చర్చించారు.
హెచ్ఆర్డీ జీఎం సందర్శన..
మందమర్రి ఏరియా జీఎం ఆఫీస్‌ను శుక్రవారం సింగరేణి కార్పొరేట్ మావన వనరుల(హెచ్ఆర్డీ) జీఎం వెంకటరమణారెడ్డి సందర్శించారు. హెచ్ఆర్డీ విభాగానికి సంబంధించిన అంశాలపై జీఎం రాధాకృష్ణ, సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ నెల 31న జీఎం వెంకటరమణారెడ్డి ఉద్యోగ విరమణ పొందనున్న నేపథ్యంలో ఆయనను సన్మానించారు.
సింగరేణిలో వివిధ హోదాల్లో పని చేసిన వెంకటరమణారెడ్డి మానవ వనరుల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఏరియా ఎస్వోటూ జీఎం విజయప్రసాద్, కేకే ఓసీపీ పీవో మల్లయ్య, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఐఈడీ ఎస్ఈ కిరణ్‌కుమార్, వీటీసీ మేనేజర్ శంకర్, పర్ఛేజ్ఆఫీసర్ బాబు, సీనియర్ పీవోలు సందీప్, కార్తీక్, అన్ని గనులు, డిపార్ట్ మెంట్ల సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.---