
మంచిర్యాల జిల్లా మందమర్రిలో బీసీ రిజర్వేషన్ కు మద్దతుగా జరిగిన బంద్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. అసెంబ్లీలో బిల్లు పాస్చేసినా.. కేంద్రం అడ్డుకుంటుందన్నారు మంత్రి వివేక్. కాంగ్రెస్ తోనే బీజీలకు న్యాయం జరుగుతుందన్న మంత్రి.. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. రాహుల్ జోడో యాత్రలో బీసీల సమస్యలు గుర్తించారన్నారు. బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బీసీ బంద్కు అన్ని పార్టీలుమద్దతు పలికాయన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీసీ సంఘాలు బస్టాండ్ ముందు అందోళనకు దిగారు. బస్ డిపో ముందు బైఠాయించిన నిరసన తెలిపారు.42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.