అయ్యప్పమాల ధరించిన విద్యార్థిని క్లాస్ లోకి అనుమతించని టీచర్స్

అయ్యప్పమాల ధరించిన విద్యార్థిని క్లాస్ లోకి అనుమతించని టీచర్స్

అయ్యప్ప మాల ధరించిన ఓ విద్యార్థిని ఉపాధ్యాయులు క్లాస్ లోకి అనుమతించలేదు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మందమర్రిలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో కళావేని తేజ అనే విద్యార్థి 10వ తరగతి చదువుతున్నాడు. అయ్యప్ప స్వామి మాల ధరించాడని సింగరేణి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుందర్ రావు.. తేజను పాఠశాలలోకి అనుమతించలేదు. 

అయ్యప్ప మాల ధరించిన కారణంగానే తన కుమారుడిని స్కూల్లోకి అనుమతించడం లేదని తేజ తండ్రి ఆరోపించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లడంతో స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పాఠశాలకు వెళ్లారు. ప్రధానోపాధ్యాయుడు సుందర్ రావును వివరణ కోరారు. తాము అయ్యప్ప మాల ధరించిన వారిని తరగతి గదిలోకి అనుమతించబోమని చెప్పాడు. దీంతో పాఠశాల సిబ్బందికి, విద్యార్థి తల్లిదండ్రుల మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.