మాంగల్యం ఫౌండేషన్:  మజ్జిగ, నీళ్లతో దాహార్తిని తీరుస్తుంది.

మాంగల్యం ఫౌండేషన్:  మజ్జిగ, నీళ్లతో దాహార్తిని తీరుస్తుంది.

ఎండలు మండిపోతున్నాయి. నగరంలో జనం ఈ ఎండలకు ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరగడంతో బయటికి రావాలంటేనే హడలిపోతున్నారు. అయితే ఈ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంధ సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సినీ రంగానికి చెందిన లత అనే మహిళ ఎండల్లో బయట తిరిగే జనాల దాహాన్ని తీర్చేందుకు నీరు మరియు చల్లటి మజ్జిగను ఇస్తూ సమాజానికి తన వంతు సాయాన్ని ఇస్తుంది.

సినీ ఆర్టిస్ట్ గా పనిచేస్తూనే హైదరాబాద్ మణికొండలో మాంగల్యం ఫౌండేషన్ పేరుతో చలివేంద్రం ఏర్పాటు చేసింది. దర్గా నుంచి మణికొండకు వెళ్లే దారిలో, చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహం తీరుస్తోంది. ఎండలో బయటకు వచ్చేవారి దాహాం తీర్చేందుకు మినరల్ వాటర్ తో పాటు ఫ్రీగా మజ్జిగా అందిస్తోంది.

పనిమీద బయటకు వచ్చే జనాలు ఎండలో తిరిగి అలసిపోతారని భావించిన లత..మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నీళ్లు, మజ్జిగ అందిస్తోంది. ఉద్యోగులు, వ్యాపారులు ఇలా ఎండలో తిరిగేవారు చలివేంద్రం దగ్గర ఆగి మజ్జిగ, వాటర్ తాగుతూ దాహాం తీర్చుకుంటున్నారు. ఉద్యోగరీత్యా, పనిమీద బయటకు వచ్చేవారికి చలివేంద్రం చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు జనం.

ఎండాకాలంలో బయటకు వచ్చేవారి దాహాం తీర్చాలనే ఉద్దేశంతో మాంగల్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశానంటోంది సినీ ఆర్టిస్ట్ లత. మినరల్ వాటర్ తో పాటు ఫ్రీగా మజ్జిగ అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెబుతుంది. ప్రజల దాహాం తీర్చేందుకు సిటీలో మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.

మండె ఎండల్లో  ఫ్రీగా మజ్జిగ, మినరల్ వాటర్ అందిస్తోన్న లతను అభినందిస్తున్నారు జనం. లతను స్పూర్తిగా తీసుకొని సిటీలో చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని కోరుతున్నారు.