ఎసిటిక్ యాసిడ్, ప్రమాదకర పౌడర్​తో మ్యాంగో కూల్ డ్రింక్స్

ఎసిటిక్ యాసిడ్, ప్రమాదకర పౌడర్​తో మ్యాంగో కూల్ డ్రింక్స్
  • డేంజర్ కెమికల్స్, అరటి కాండంతో  అల్లం వెల్లుల్లి పేస్ట్
  • ఎసిటిక్ యాసిడ్, ప్రమాదకర పౌడర్​తో మ్యాంగో కూల్ డ్రింక్స్ 
  • హైదరాబాద్ లోని కాటేదాన్​లో  కల్తీ ఐటమ్స్ తయారీ 
  • ఎస్ వోటీ పోలీసుల దాడులు.. ఇద్దరు అరెస్టు
  • 5 క్వింటాళ్ల అల్లం  వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం 

శంషాబాద్, వెలుగు:  కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లి పొట్టు, అరటి కాండం, నాన్ వెజ్ మసాలాలు, డేంజర్ కెమికల్స్.. ఇవీ ఓ పరిశ్రమలో అల్లంవెల్లుల్లి పేస్టు తయారీకి వాడుతున్న పదార్థాలు. ఈ కల్తీ అల్లంవెల్లుల్లి పేస్టును ‘డైమండ్ జింజర్ గార్లిక్ పేస్ట్’ పేరుతో మార్కెట్ లో అమ్ముతున్నారు. ఈ ముఠాను హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ ఎస్ వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలోని పరిశ్రమపై దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. 

500 కిలోల అల్లంవెల్లుల్లి పేస్ట్, మ్యాంగో కూల్ డ్రింక్స్, ప్రమాదకర కెమికల్స్, తెల్లటి పౌడర్, 210 లీటర్ల ఎసిటిక్ యాసిడ్, 550 కిలోల నాన్ వెజ్ మసాలా ప్యాకెట్లు, దాదాపు ఒక టన్ను వెల్లుల్లిని స్వాధీనం చేసుకున్నారు. మైలార్ దేవ్ పల్లికి చెందిన ఫిరోజ్ అలీ(45), అజిత్ (55) కలిసి కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో రూల్స్ కు విరుద్ధంగా పరిశ్రమ ఏర్పాటు చేశారు. ఇందులో కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్, మ్యాంగో కూల్ డ్రింక్స్ తయారు చేస్తున్నారు. కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లి పొట్టు, అరటి కాండం, నాన్ వెజ్ మసాలాలు, ప్రమాదకర కెమికల్స్​తో అల్లంవెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారు. 

మ్యాంగో కూల్ డ్రింక్స్ తయారీలో ఎసిటిక్ యాసిడ్​తో పాటు ప్రమాదకర పౌడర్ వాడుతున్నారు. దీనిపై సమా చారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్ వోటీ పోలీసులు ఆదివారం పరిశ్రమపై దాడులు చేశారు. మురుగు నీళ్లు, డేంజర్ కెమికల్స్​తో పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నిర్వాహకులు ఫిరోజ్ అలీ, అజిత్ ను అదుపులోకి తీసుకొని మైలార్ దేవ్ పల్లి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.