ట్రంప్.. ఆమెకు రూ.41 కోట్లు చెల్లించాల్సిందే

ట్రంప్.. ఆమెకు రూ.41 కోట్లు చెల్లించాల్సిందే

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న డొనాల్డ్‌ ట్రంప్‌నకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే శృంగార తార స్టార్మీ డేనియల్స్‌తో వివాహేతర సంబంధాన్ని దాచి ఉంచేందుకు అనైతిక ఒప్పందం కుదుర్చుకున్నారన్న కేసులో 34 అభియోగాలను ఎదుర్కొంటున్న  ట్రంప్..  మంగళవారం (మే 9వ తేదీన)’ ఓ కేసులో ఏకంగా దోషిగా తేలారు. 

1996లో మన్‌హటన్‌లోని ఓ స్టోర్‌లో రచయిత, కాలమిస్టు.. జీన్‌ కెరల్‌పై ట్రంప్‌ లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారని మన్‌హట్టన్‌ ఫెడరల్‌ జ్యూరీ నిర్ధారణకు వచ్చింది. పరిహారంగా ఆమెకు 5 మిలియన్‌ డాలర్లు అంటు సుమారు రూ.41 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.

 కెరల్‌ చేసిన అత్యాచార ఆరోపణల నుంచి మాత్రం ట్రంప్‌ బయటపడ్డాడు. 2024 ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్న ట్రంప్‌నకు ఇది ఎదురుదెబ్బే. ఈ తీర్పు తనకు.. తనలాంటి బాధితులకు విజయం అని 79 ఏళ్ల కెరల్‌ తెలిపారు.