ధాన్యం కొనుగోళ్లలో ఎందుకు ఆలస్యం

ధాన్యం కొనుగోళ్లలో ఎందుకు ఆలస్యం

టీఆర్ఎస్ తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడమే తప్ప రైతులకు చేసిందేమిలేదని విమర్శించారు టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్.  ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అసలు ధాన్యం కొనుగోళ్లలో ఎందుకు ఆలస్యం అవుతుందని ఆయన ప్రశ్నించారు. ధాన్యం కల్లాల్లల్లో ఉన్నప్పుడు ఎందుకు టార్పాలిన్ కవర్లు సిద్ధం చెయలేదని నిలదీశారు. ఈ వారంలో వర్షాలు పడతాయని తెలిసినా ఇంతగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. తడిసిన ధాన్యంతో ఒకవైపు రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్  మాత్రం ఫాంహౌస్ లో కూర్చోని చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

 

మరిన్ని వార్తల కోసం

టెస్ట్ డ్రైవ్ అన్నాడు.. కారు ఎత్తుకెళ్లాడు, 100 రోజుల తర్వాత

బ్యాంక్ చోరీ కేసులో కొత్త ట్విస్ట్..కోర్టులో ప్రత్యక్షం