టెస్ట్ డ్రైవ్ అన్నాడు.. కారు ఎత్తుకెళ్లాడు, 100 రోజుల తర్వాత

టెస్ట్ డ్రైవ్ అన్నాడు.. కారు ఎత్తుకెళ్లాడు, 100 రోజుల తర్వాత

తమ వాహనాలను సేల్ చేయడానికి యాడ్స్ రూపంలో కొంతమంది ప్రకటనలు ఇస్తే.. మరికొంతమంది యాప్స్ లో సేల్ చేస్తామంటూ ప్రకటనలు ఇస్తుంటారు. ఇలాగే ఓ వ్యక్తి కారు సేల్ చేయాలని అనుకుంటున్నట్లు ఓ యాప్ లో వెల్లడించాడు .టెస్టు డ్రైవ్ నెపంతో ఇంజినీర్ కు చెందిన ఆ కారును ఓ వ్యాపారవేత్త దొంగిలించాడు. అతడిని పట్టుకోవడానికి పోలీసులకు సుమారు 100 రోజులు పట్టింది. జనవరి 30వ తేదీన దొంగతనం జరిగితే.. మే 10వ తేదీన పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన బెంగళూరు మహానగరంలో చోటు చేసుకుంది.

OLXలో ప్రకటన :-
రవీంద్ర ఎలూరి అనే వ్యక్తి  కారును విక్రయించాలని అనుకున్నాడు. ఓఎల్ ఎక్స్ లో (OLX)లో ప్రకటన ఇచ్చాడు. జనవరి 30వ తేదీన కొంతమంది ఆసక్తి చూపారు. అందులో నగరంలోని అమృతనగర్ కు చెందిన ఎంజీ వెంకటేష్ నాయక్ కూడా ఉన్నాడు. టెస్టు డ్రైవ్ చూసి చెబుతానని చెప్పడంతో కారు కీని అతనికి ఇచ్చాడు. బయటకు వెళ్లిన అతను ఎంతకు తిరిగిరాలేదు. వెంటనే రవీంద్ర ఎలూరి అమృతహళ్లీ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. నాయక్ చిరునామ తెలియనందున గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేశారు. అతని మొబైల్ ద్వార ట్రేస్ చేయడానికి ప్రయత్నించారు.  ఆ ఫోన్ ను కూడా అతను దొంగిలించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. చివరకు OLX కార్యాలయాలను పోలీసులు సంప్రదించారు. సుమారు 2500 IP చిరునామాలను పొందారు.

మూడు నెలల తర్వాత : -
దాదాపు మూడు నెలల పాటు IP చిరునామాలను ధృవీకరించడం జరిగిందని, మే 10వ తేదీన తమ ప్రయత్నం ఫలించిందని దర్యాప్తు అధికారి వెల్లడించారు. నేరాన్ని నిందితుడు అంగీకరించాడు. అయితే.. దీనికి ఓ కారణం చెప్పాడు. 2020, డిసెంబర్ లో జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో తన భార్య పరాజయం పాలైందని, అప్పలు తీర్చేందుకు తనవద్దనున్న Vitara Brezza కారును విక్రయించినట్లు తెలిపాడు. కారు లేకుండా తన గ్రామానికి వెళ్లడం అవమానంగా భావించినట్లు, ప్రకటన చూసిన అనంతరం కారును దొంగిలించాలని పథకం వేశాడని పోలీసులు తెలిపారు. ఇతడిని స్థానిక కోర్టులో హాజరు పరచగా.. జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ విధించింది.

మరిన్ని వార్తల కోసం : 

బీజేపీ దేశాన్ని రెండుగా విభజించింది


షాకిస్తున్న టమాట.. కొండెక్కిన కోడి