రేపు హైదరాబాద్కు మాణిక్కం ఠాగూర్

రేపు హైదరాబాద్కు మాణిక్కం ఠాగూర్

మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఇందులో భాగంగా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ రేపు హైదరాబాద్ కు రానున్నారు. వ్యూహ ప్రతివ్యూహాలపై చర్చించేందుకు మూడు రోజుల పాటు ఇక్కడే మకాం వేయనున్నారు. 

17వ తేదీన గాంధీ భవన్లో పీసీసీ ముఖ్య నాయకులతో మాణిక్కం  ఠాగూర్ సమావేశం కానున్నారు. మునుగోడు ఉప ఎన్నిక,పార్టీ అంతర్గత విషయాలపై చర్చించనున్నారు. అదే రోజున మునుగోడులోని 7 మండలాల ఇంఛార్జులతో ఆయన భేటీ కానున్నారు. సాయంత్రం 5గంటలకు డీసీసీ అధ్యక్షులతో సమావేశమై ఆజాదీ కా గౌరవ్ కార్యక్రమం తీరుతెన్నులను సమీక్షించనున్నారు. 18వ తేదీన కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం కానున్న మాణిక్కం ఠాగూర్.. సాయంత్రం 4:15 గంటలకు హైదరాబాదు నుండి మధురై వెళ్లనున్నారు.