తెలంగాణలో ప్రచారానికి డీకే..మాణిక్ రావ్ ఠాక్రే ఏమన్నారంటే.?

తెలంగాణలో ప్రచారానికి డీకే..మాణిక్ రావ్ ఠాక్రే ఏమన్నారంటే.?

బీజేపీ, బీఆర్ఎస్  రహస్య మిత్రులని..రెండు పార్టీలు కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే . 100 శాతం  2023లో  తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి దేశంలో ఉన్న కాంగ్రెస్ కీలక నేతలు వస్తారన్నారు.  కర్ణాటక డిప్యూటీ సీఎం DK శివ కుమార్ తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వస్తారా లేదా అన్నది ఏఐసీసీదే తుది నిర్ణయం అని చెప్పారు. 

తెలంగాణ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా  ప్రచారం కోసం వేల కోట్ల  రూపాయల ప్రజల సొమ్మును ఖర్చు చేస్తుందని ఆరోపించారు. కేసీఆర్ పేదలను విస్మరించి, కుటుంబ సభ్యుల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల సంపదను కేసీఆర్ తన కుటుంసభ్యుల కోసం దోచి పెడుతున్నారని ధ్వజమెత్తారు.  బీఆర్ఎస్ పాలన నిరుద్యోగులకు శాపంగా మారిందన్నారు.