మర్రి శశిధర్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపిన మాణిక్కం ఠాగూర్

మర్రి శశిధర్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపిన మాణిక్కం ఠాగూర్

మాజీ మంత్రి, బీజేపీ లీడర్ మర్రి శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ లీగల్ నోటీసులు పంపారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని అందులో స్పష్టం చేశారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మర్రి శశిధర్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు.  

కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని, అది నయం చేయలేని స్థితికి చేరుకుందని మర్రి శశిధర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మాణిక్కం ఠాగూర్‌... రేవంత్‌ రెడ్డికి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. తనపై మర్రి శశిధర్ నిరాధారమైన ఆరోపణలు చేయడంపై స్పందించిన మాణిక్కం ఠాగూర్ లీగల్ నోటీసు ఇచ్చారు.