మణికొండలో రెండు డివిజన్లేనా..?..90 వేలకుపైగా ఓటర్లు, మూడు లక్షలకుపైగా జనాభా

మణికొండలో రెండు డివిజన్లేనా..?..90 వేలకుపైగా ఓటర్లు, మూడు లక్షలకుపైగా జనాభా

గండిపేట, వెలుగు: మణికొండ మున్సిపాలిటీని జీహెచ్‌‌ఎంసీలో విలీనం చేసి రెండు డివిజన్లుగా ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. సోమవారం మణికొండ సర్కిల్ కార్యాలయంలో పలువురు కాంగ్రెస్ నాయకులు అధికారులను కలిశారు. మణికొండ కాంగ్రెస్ అధ్యక్షుడు జితేందర్ మాట్లాడుతూ.. తక్కువ ఓటర్లు, జనాభా ఉన్న నార్సింగిని మూడు డివిజన్లుగా విభజించారని, దానికి రెట్టింపు 90 వేలకుపైగా ఓటర్లు, మూడు లక్షలకుపైగా జనాభా ఉన్న మణికొండను రెండు డివిజన్లుగా మాత్రమే విభజించడం సరికాదని, నాలుగు డివిజన్లుగా ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు.