మణిపుర్​ హింసాకాండ.. 6వేలకు పైగా కేసులు నమోదు

మణిపుర్​ హింసాకాండ.. 6వేలకు పైగా కేసులు నమోదు

మణిపుర్​లో జాతుల మధ్య.. రిజర్వేషన్ రేపిన కార్చిచ్చులో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసిన ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఈ గొడవల్లో ఇప్పటి వరకు 6 వేలకు పైగా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు జులై 22న  తెలిపారు. మహిళల ఊరేగింపు వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారడంతో దేశం మొత్తం ఆగ్రహావేశాలు పెల్లుబిక్కాయి. 

దీంతో ప్రభుత్వ సంస్థలు, భద్రతా బలగాలు మణిపుర్​లోని అన్ని సంఘటనలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇంటర్నెట్, డిజిటల్​ప్లాట్​ఫాంలపై కఠిన ఆంక్షలు విధించాయి. నమోదైన కేసుల్లో ఎక్కువగా ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టడం, నాశనం చేయడం వంటివే ఎక్కువగా ఉన్నాయి. 

అయితే శాంతి భద్రతల పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం 135 సహాయక విభాగాలను అక్కడికి పంపింది. ఇప్పటికి అడపదడప సంఘటనలు జరుగుతన్నప్పటికీ పరిస్థితి అదుపులోకి వస్తున్నట్లు సీనియర్​అధికారి ఒకరు వెల్లడించారు. 16 జిల్లాలు ఇంకా సమస్యాత్మక ప్రాంతాలుగానే ఉన్నాయి. ఈ పరిస్థితి కంట్రోల్​ చేయడానికి బలగాలను రొటేషన్​ విధానంలో వాడుతున్నట్లు పోలీసులు తెలిపారు.