మనీష్ సిసోడియా బ్యాంక్ లాకర్‌లో సీబీఐ సోదాలు

మనీష్ సిసోడియా బ్యాంక్ లాకర్‌లో సీబీఐ సోదాలు

ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బ్యాంక్ లాకర్‌లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ )  ఉదయం 11 గంటల  నుండి సోదాలు చేస్తోంది. వారికి సహకరించేందుకు సిసోడియా తన భార్యతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు వచ్చారు. తన బ్యాంక్ లాకర్‌లో సోదాలు చేసేందుకు సీబీఐ రాబోతోందంటూ మనీష్ సిసోడియా నిన్న(సోమవారం)  ట్వీట్ చేశారు.

ఆగస్టు 19న తన ఇంట్లో 14 గంటలపాటు జరిపిన సోదాల్లో ఏమీ దొరకలేదని, లాకర్‌లో కూడా ఏమీ దొరకదని ధీమాగా చెప్పారు. తాను సీబీఐని స్వాగతిస్తున్నానని, విచారణకు పూర్తిగా తన కుటుంబ సభ్యులు కుడా  సహకారం అందిస్తారని సిసోడియా తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీలో అవినీతి జరిగిందంటూ 15 మందిపై  సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

ఇందులో మొదటి నిందితుడుగా సిసోడియా పేరును సీబీఐ పేర్కొంది. ఎక్సైజ్‌ పాలసీలో  144 కోట్లు అవినీతి జరిగిందంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోంది.