అదరగొట్టిన శాకుంతలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్

అదరగొట్టిన శాకుంతలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్

టాలీవుడ్ బ్యూటీ సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’.  ఇందులో శకుంత‌ల‌గా స‌మంత‌.. దుష్యంతుడిగా దేవ్ మోహ‌న్ న‌టించారు. గణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కించాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ వార్తల్లోకెక్కుతున్న డైరెక్టర్, తాజాగా సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యాజిక్ ని లాంచ్ చేశాడు. ఇందులో భాగంగా శాకుంతలం ఆర్‌ఆర్‌ సెషన్ కు సంబంధించిన వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ హంగేరికి చెందిన బడాపెస్ట్ సింఫనీ ఆర్ కెస్ట్రా వాళ్లతో కలిసి ఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందించాడు.  

ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని మేకర్స్ తెలిపారు. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్నడ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల‌ కానుంది. గతేడాది నవంబర్ లోనే విడుదల చేస్తామని ముందుగా ప్రకటించినా తర్వాత వాయిదా వేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. కానీ, చాన్నాళ్ల నుంచి విడుదల తేదీ గురించి సమాచారం లేకపోవడంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు. అయితే, కొత్త ఏడాది సందర్భంగా ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేశారు.