బీ అలర్ట్ : హైదరాబాద్ సిటీలోని ఈ ప్రాంతాల్లో నల్లా నీళ్లు బంద్

బీ అలర్ట్ : హైదరాబాద్ సిటీలోని ఈ ప్రాంతాల్లో నల్లా నీళ్లు బంద్
  •     పైప్ లైన్ రిపేర్ పనులతో సరఫరాలో అంతరాయం 
  •     వాటర్ బోర్డు అధికారుల వెల్లడి

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ ​హైదరాబాద్​కు తాగునీరు సరఫరా చేసే మంజీరా ప్రాజెక్ట్ ఫేజ్ 2 లో  పటాన్ చెరు నుంచి హైదర్ నగర్ వరకు పైప్​లైన్​కు భారీ లీకేజీ ఏర్పడింది.  దీంతో రిపేర్ చేయనుండగా.. బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరాను బంద్ చేస్తారు. ఆయా  డివిజన్ల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని మెట్రోవాటర్​బోర్డు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్ (లోప్రెజర్ తో నీటిసరఫరా), హాఫ్ టెక్ పాయింట్లు, బల్క్ కనెక్షన్లు.  కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, భాగ్య నగర్ కాలనీ, వసంత్ నగర్. ఆర్సీ పురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, దీప్తి శ్రీ నగర్, మదీనాగూడ, మియాపూర్,  బీరంగూడ, అమీన్ పూర్, బొల్లారం తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని అధికారులు వెల్లడించారు.