మన్కడింగ్‌‌ రూల్స్‌‌లో కీలక నిర్ణయం

మన్కడింగ్‌‌ రూల్స్‌‌లో కీలక నిర్ణయం

లండన్‌‌: క్రికెట్‌‌లో మన్కడింగ్‌‌ అనైతికం అనే చర్చకు ముగింపు పలికేలా క్రికెట్‌‌ చట్టాలను సంరక్షించే మెరిల్‌‌బోన్‌‌ క్రికెట్‌‌ క్లబ్‌‌ (ఎంసీసీ) రూల్స్‌‌లో కీలక మార్పులు చేసింది. మన్కడింగ్‌‌ను అనైతికం అనే రూల్​ నుంచి తీసేసి రనౌట్‌‌ కేటగిరీలోకి మార్చింది. అలాగే, బాల్‌‌పై మెరుపు తెచ్చేందుకు  సలైవా (ఉమ్మి) రుద్దడంపై  నిషేధాన్ని శాశ్వతంగా కొనసాగించాలని నిర్ణయించింది.  ఈ మేరకు క్రికెట్‌‌ రూల్స్‌‌లో  చేసిన పలు మార్పులు అక్టోబర్‌‌ నుంచి అమల్లోకి వస్తాయని చెప్పింది. ఇకపై  రీప్లేస్‌‌మెంట్‌‌గా వచ్చే ఆటగాడిని ఒరిజినల్‌‌ ప్లేయర్‌‌గానే పరిగణిస్తారు. క్యాచ్‌‌ ఔట్‌‌ అయిన తర్వాత క్రీజులోకి వచ్చే కొత్త బ్యాటర్‌‌ ఓవర్‌‌ ముగిస్తే తప్ప  స్ట్రయిక్‌‌ ఎండ్‌‌లోకే రావాలి. బ్యాటర్​ క్రీజులో ఎక్కడ నిల్చున్నాడనేదాన్ని బట్టి వైడ్​ను గుర్తిస్తారు. అలాగే, బ్యాటర్‌‌ బాల్‌‌ను ఎదుర్కొంటున్నప్పుడు ఫీల్డర్లు గ్రౌండ్‌‌లో ఉద్దేశపూర్వకంగా కదిలితే  ఫీల్డింగ్‌‌ జట్టుకు పెనాల్టీ విధించి బ్యాటింగ్‌‌ టీమ్‌‌కు ఐదు రన్స్‌‌ ఇస్తారు.