రక్షణ విభాగంలో భారత్ మరో అడుగు

రక్షణ విభాగంలో  భారత్  మరో అడుగు

రక్షణ విభాగంలో స్వయం సంవృద్ధివైపు మరో అడుగు వేసింది భారత్.. 5 లక్షలకుపైగా AK-203 రైఫిల్స్ తయారీ కోసం రూపొందించిన ప్రణాళికకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ రైఫిల్స్ ను ఉత్తరప్రదేశ్ లోని అమేథిలో తయారు చేయనున్నారు. భారత డిఫెన్స్ సామాగ్రి తయారీ హబ్ గా ఉత్తరప్రదేశ్ అవతరించనుందని కేంద్ర వర్గాలు అభిప్రాయపడ్డాయి. కొనుగోళ్ల నుంచి మేక్ ఇన్ ఇండియా స్థానికి భారత్ చేరుతోందని అధికారులు తెలిపారు. రష్యా భాగస్వామ్యంతో ఈ రైఫిల్స్ ను తయారు చేయనున్నట్లు వెల్లడించారు. 30 ఏళ్లుగా వినియోగిస్తున్న INSAS రైఫిల్స్ స్థానంలో  అధునాతన ఆయుధాలు అందుబాటులోకి రానున్నాయి.