మూడో ప్రపంచ యుద్ధంపై పబ్లిక్ ఒపీనియన్ ఇదే.. వరల్డ్ వార్ 3 వస్తుందా.. లేదా..? అని సర్వే చేస్తే తేలిందేంటంటే..

మూడో ప్రపంచ యుద్ధంపై పబ్లిక్ ఒపీనియన్ ఇదే.. వరల్డ్ వార్ 3 వస్తుందా.. లేదా..? అని సర్వే చేస్తే తేలిందేంటంటే..

ప్రపంచంలో ఏం జరుగుతుంది.. ఏం జరగబోతుంది.. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా.. రాదా.. మూడో ప్రపంచ యుద్ధం వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి.. వరల్డ్ వార్ 3లో ఏయే దేశాలు పాల్గొంటాయి.. మరో యుద్ధం వస్తే వినాశం ఎలా ఉంటుంది.. యుద్ధం గురించి మీకు ఏం తెలుసు అనే అంశాలపై యూరప్, అమెరికాలో చేసిన సర్వే వివరాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. యుద్ధంపై వారు చెప్పిన అభిప్రాయాలు షాకింగ్ గా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

  • రెండో ప్రపంచ యుద్ధం ముగిసి సరిగ్గా 80 ఏళ్లు అవుతుంది.. ఈ సందర్భంగా ప్రముఖ అంతర్జాతీయ మీడియా ఓ సర్వే చేసింది. ఈ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.
  • మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అని ప్రశ్నించగా.. 45 శాతం అమెరికన్లు.. వరల్డ్ వార్ 3 వస్తుందని.. బలంగా నమ్ముతున్నామని వెల్లడించారు. 
  • మూడో ప్రపంప యుద్ధం వస్తుందా అంటే.. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ దేశాల్లోని 55 శాతం మంది వస్తుంది.. అది కూడా ఐదు నుంచి పదేళ్లల్లోనే పూర్తి స్థాయిలో జరుగుతుంది అని బలంగా నమ్ముతున్నారంట.
  • ఈసారి యుద్ధం జరిగితే అణ్వాయుధాలు ప్రయోగిస్తారా అని ప్రశ్నిస్తే.. 68 నుంచి 76 శాతం మంది అణ్వాయుధాలతో మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని బలంగా విశ్వసిస్తున్నారంట. 
  • మూడో ప్రపంచ యుద్ధం వస్తే.. ఎంత మంది చనిపోతారో మీకు తెలుసా అని ప్రశ్నిస్తే.. 1939 నుంచి 1945 మధ్య జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో మరణించిన వారి కంటే.. చాలా ఎక్కువగానే ప్రాణ, ఆస్తి నష్టం ఉంటుందని 25 నుంచి 44 శాతం మంది నమ్ముతున్నారు.
  • మూడో ప్రపంచ యుద్దంలో మీ దేశం పాల్గొంటుందా అని ప్రశ్నిస్తే.. అవును మా దేశంలో మూడో ప్రపంచ యుద్ధంలో పాల్గొంటుందని ఇటలీలో 66 శాతం మంది చెప్పారు.
  • మూడో ప్రపంచ యుద్ధంలో మా దేశం పాల్గొంటుందని 89 శాతం మంది బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లోని ప్రజలు స్పష్టంగా చెప్పారు. 
  • మీ దేశం సైన్యం యుద్ధం నుంచి మిమ్మల్ని రక్షిస్తుందా అంటే ఫ్రాన్స్ లో 44 శాతం మంది మాత్రమే అవును అని సమాధానం ఇవ్వగా.. ఇటలీలో అతి తక్కువగా 16 శాతం మంది మాత్రమే.. ఇటలీ సైన్యంపై నమ్మకం వ్యక్తం చేశారు. 
  • మూడో ప్రపంచ యుద్ధం నుంచి మీ సైన్యం మిమ్మల్ని కాపాడుతుందా అంటే 72 శాతం మంది అమెరికన్లు.. తమ దేశ భద్రత, సైన్యంపై నమ్మకం ఉంచారు. 
  • మూడో ప్రపంచ యుద్ధానికి కారణం అయ్యే దేశాలు ఏంటీ అని ప్రశ్నిస్తే.. రష్యా వల్లే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని 82 శాతం మంది అమెరికన్లు నమ్ముతున్నారు.
  • మూడో ప్రపంచ యుద్ధం రష్యా వల్లే వస్తుందని 72 శాతం మంది యూరోపియన్ యూనియన్ దేశాలు.. యూరప్ దేశాల్లోని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు.
  • ఇస్లామిక్ ఉగ్రవాదం వల్ల మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అని భావించే వారు రష్యా కంటే.. చాలా చాలా తక్కువగా ఉండటం విశేషం. 
  • రెండో ప్రపంచ యుద్ధం గురించి మీకు తెలుసా.. ఆ యుద్ధం వల్ల ఏం నష్టం జరిగిందో తెలుసా అని ప్రశ్నిస్తే.. ఫ్రాన్స్ లో 72 శాతం మంది.. జర్మనీలో 70 శాతం మంది.. బ్రిటన్ లో 66 శాతం మంది, స్పెయిన్ లో 40 శాతం మంది మాకు తెలుసు.. ఐడియా ఉంది అని స్పష్టంగా చెప్పారు.
  • అమెరికాను మీరు మిత్ర దేశంగా భావిస్తున్నారా లేక శత్రు దేశంగా చూస్తున్నారా అని ప్రశ్నిస్తే.. మిత్ర దేశం అని స్పెయిన్ లో 58 శాతం మంది, జర్మనీలో 55 శాతం మంది, ఫ్రాన్స్ లో 53 శాతం మంది ప్రజలు చెప్పారు.
  • మీ పిల్లలకు యుద్ధం గురించి తెలుసా.. మీ స్కూల్స్, కాలేజీల్లో యుద్ధం గురించి చెబుతారా అని ప్రశ్నిస్తే.. మా స్కూల్స్, కాలేజీల్లో యుద్ధం గురించి చెబుతారు అని 77 శాతం మంది ఫ్రాన్స్ జనం చెప్పగా.. జర్మనీలో 60 శాతం, బ్రిటన్ లో 48 శాతం, స్పెయిన్ లో 34 శాతం మంది వివరించారు.

ఓవరాల్ గా ఈ సర్వే ఏం చెబుతుంది అంటే.. మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది.. వచ్చి తీరుతుంది అని 50 శాతం  యూరప్ దేశాలు, అమెరికాలోని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఎంతలా అంటే రాబోయే ఐదు నుంచి పదేళ్లలోనే పూర్తిస్థాయిలో మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది అని..