మీ వెంటే మేము.. వివేక్​ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్​లో భారీగా చేరికలు

మీ వెంటే మేము.. వివేక్​ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్​లో భారీగా చేరికలు
  •     కాంగ్రెస్​లో భారీగా చేరికలు

బెల్లంపల్లి రూరల్/మందమర్రి, వెలుగు : తమ ప్రియతమ నేత మాజీ ఎంపీ గడ్డం వివేక్​ వెంకటస్వామి వెంటే తామూ ఉంటామని పలువురు నేతలు కాంగ్రెస్​లో చేరారు. వివేక్​ వెంకటస్వామి సమక్షంలో బీజేపీ వేమనపల్లి మండల ప్రధాన కార్యదర్శి గణపురం సంతోష్, మండల ఉపాధ్యక్షుడు తలండి రమేశ్, మండల బీసీ అధ్యక్షుడు కుబిడె అంజన్న, మాజీ జడ్పీటీసీ బైరి వెంకటేశ్​హస్తం గూటికి చేరారు.

బెల్లంపల్లిలో గడ్డం వినోద్​ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సంతోష్​కుమార్, కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు సాబీర్ ​ఆలీ, పార్టీ సీనియర్​ నేత దుర్గం ఎల్లయ్య పాల్గొన్నారు. మందమర్రి తదితర ప్రాంతాల బీజేపీ నేతలు కాంగ్రెస్​లో చేరారు.