మెదక్ జిల్లాకు, తెలుగు వర్సిటీకి గద్దర్ పేరు పెట్టాలి : వక్తల డిమాండ్

మెదక్ జిల్లాకు, తెలుగు వర్సిటీకి  గద్దర్ పేరు పెట్టాలి : వక్తల డిమాండ్
  • మెదక్ జిల్లాకు, తెలుగు వర్సిటీకి  గద్దర్ పేరు పెట్టాలి
  •  గద్దర్ సంస్మరణ సభలో పలువురు వక్తల డిమాండ్

ముషీరాబాద్, వెలుగు : మెదక్ జిల్లాకు, తెలుగు యూనివర్సిటీకి గద్దర్ పేరు పెట్టాలని  పలువురు వక్తలు  డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గద్దర్ సంస్మరణ సభ జిలుకర  శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. తమిళనాడు ఎంపీ తిరుమావలన్, కంచ ఐలయ్య, ప్రొఫెసర్ కోదండరాం, చెరుకు సుధాకర్, నల్లా సూర్య ప్రకాశ్, జయరాజ్, విమలక్క హాజరై మాట్లాడారు. 

గద్దర్ ఆట,పాటతో అన్నివర్గాల ప్రజలను చైతన్యవంతం చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గద్దర్ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు. ట్యాంక్ బండ మీద గద్దర్ విగ్రహం పెట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు.