మీరు పెట్టిన కల్తీ ఆహారం తిని దవాఖాన్ల పాలయ్యిన్రు

మీరు పెట్టిన కల్తీ ఆహారం తిని దవాఖాన్ల పాలయ్యిన్రు

బాసర ట్రిపుల్ ఐటీలో మీరు పెట్టిన కలుషితమైన, కల్తీ ఆహారం తిని 800మంది దవాఖాన్ల పాలయ్యారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో జరిగిన పుడ్ పాయిజన్ పై స్పందించిన రేవంత్ రెడ్డి రాష్ట్ర సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థులను పరామర్శించేందుకు బల్మూరి వెంకట్ పోతే అరెస్ట్ చేసి జైళ్లో పెట్టారన్నారు. 800మంది విద్యార్థులు ఏ దవాఖానాలో ఉన్నారో తెలియదు. ఎవరి పిల్లలకు ఆరోగ్యం బాగోలేదో ఆ తల్లిదండ్రులకు తెలియదన్నారు. ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వ దోపిడీకి వందలాది మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులు బలైతే.. ఈ కేటీఆర్ నిజంగా అన్నం తినేటోడైతే అధికారులతో సమీక్ష చేసేటోడని, వైద్య బృందాలను పంపించేటోడని, తనే స్వయంగా అక్కడికి వెళ్లి బావా బామ్మర్దులిద్దరూ కలిసి ఆ విద్యార్థులను కాపాడేటోళ్లని ఆరోపించారు. వందలాది మంది విద్యార్థులు చావు బతుకుల మధ్య ఉన్నా ప్రభుత్వానికి ఏ పట్టింపూ లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.

సర్వేలన్నీ మాకు అనుకూలంగా ఉన్నయ్.. మేమే గెలుస్తమని అనుకుంటున్నరు. కానీ ఈ రోజు సర్వేలన్నీ 50 50 సీట్లు వస్తాయని చెప్తున్నయ్. అంటే సగం ఆల్రెడీ చచ్చిపోయిన్రు. నడుముల దాకా పక్షవాతం వచ్చింది. ఇక మీకున్నది ఆ పైననే కొంచెం. వచ్చే 6 నెలల్లో అది కూడా చస్తరు. తెలంగాణ ప్రజలు పాడెకట్టి మోస్కపోనీకే... సిద్ధంగున్నరు. 18 నెలల తర్వాత జరగబోయే ఎన్నికల మీద నువ్వు, నీ అయ్య గెలవబోయే విషయంపై మాట్లాడుతున్నారని రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వసలు మనిషావా అంటూ...  ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లల గురించి ఆలోచన లేదు, ప్రాజెక్టులు కొట్టుకుపోతే దాని మీద ఎలా చర్యలు తీసుకోవాలో చెప్పవు, సంబంధిత అధికారులతో సమీక్షలు చేయవు, ఏ దానికీ పనికి రావంటూ రేవంత్ ఆరోపించారు.