సైలెంట్ గా గుండెపోటు

సైలెంట్ గా గుండెపోటు

అతను సడెన్‌‌గా హార్ట్‌‌ఎటాక్‌‌ వచ్చి చనిపోయాడు అని చాలా మంది అనడం వినే ఉంటాం. కానీ గుండె ఆగిపోవడం అలా హఠాత్తుగా జరగదట. అంతకుముందే చాలా సార్లు హార్ట్‌‌ఎటాక్‌‌ వచ్చి పీక్‌‌ స్టేజ్‌‌లో గుండె ఆగిపోతుందట. ఇలా సైలెంట్‌‌గా వచ్చే హార్ట్‌‌ఎటాక్‌‌లను రోగులు గుర్తించలేరట. ఇటీవలి ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

సడన్‌‌ హార్ట్‌‌ఎటాక్‌‌తో చనిపోయిన వారిలో సుమారు 42 శాతం మందికి అంతకుముందే చాలా సార్లు ‘సైలెంట్‌‌’ గుండెపోటు వచ్చినట్టు తమ స్టడీలో తెలిసిందని సైంటిస్టులు చెబుతున్నారు. హార్ట్‌‌ఎటాక్‌‌కు సంబంధించి కొన్ని లక్షణాలు ముందే తెలుస్తాయని, కానీ రోగులు వాటిని గుర్తించలేరని అంటున్నారు. తమ స్టడీకి ఉత్తర ఫిన్‌‌లాండ్‌‌లో1998 నుంచి 2017 మధ్య గుండెపోటుతో చనిపోయిన వారి  వివరాలను రీసర్చర్లు పరిశీలించారు.  అయితే సడన్‌‌ హార్ట్‌‌ఎటాక్‌‌ వచ్చిన వారు ముందు చాలా సార్లు గుండెపోటు వచ్చినందుకే చనిపోయారని చెప్పలేమని, దీనిపై ఇంకా పరిశోధన చేయాల్సి ఉందని రీసెర్చర్లు చెప్పారు.

2010లో అమెరికన్‌‌ హార్ట్‌‌ జర్నల్‌‌లో పబ్లిష్‌‌ అయిన ఓ స్టడీలో సడన్‌‌ హార్ట్‌‌ఎటాక్‌‌తో చనిపోయిన వారిలో 34 శాతం మందికి ముందే గుండెపోటు వచ్చిందని పేర్కొన్నారు. గుండెకు రక్తం సరఫరా ఆగిపోతే హార్ట్‌‌ఎటాక్‌‌ వస్తుంది. కానీ సడన్‌‌ హార్ట్‌‌ఎటాక్‌‌లో గుండె పని చేయడం పూర్తిగా ఆగిపోతుంది. స్పృహ కోల్పోతారు. సడన్‌‌ హార్ట్‌‌ఎటాక్‌‌కు అసలు సమస్య హార్ట్‌‌ఎటాకే.