
మునుగోడు ఉపఎన్నిక తో టీఆర్ఎస్, బీజేపీ స్వార్థ రాజకీయాల పరిరక్షణకు తెరలేపాయని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. రాష్ట్రంలో బీజేపీ మతోన్మాద వాతావరణాన్ని సృష్టిస్తోందని.. బీజేపీ హిందుత్వ ఎజెండాతో రాష్ట్రంపై శక్తియుక్తులను ప్రదర్శిస్తుందని మండిపడింది. దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చే ప్రక్రియలో భాగంగానే బీజేపీ తెలంగాణపై ఫోకస్ పెట్టిందన్నారు. మునుగోడులో గెలవడం కోసం రాష్ట్రంలో మతవిధ్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ పనిగా పెట్టుకుందని విమర్శించారు.
కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని మావోయిస్ట్ పార్టీ ఆరోపించింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మహమ్మద్ ప్రవక్తపై అవమానకర వ్యాఖ్యలు చేశాడని.. అయితే బీజేపీ మాత్రం సస్పెన్షన్ అంటూ కంటి తుడుపు చర్యలు తీసుకోవడం సిగ్గుచేటని మండిపడింది. హైదరాబాద్ లో విధించిన కర్ఫ్యూ రాష్ట్రంలో మతకల్లోలానికి సంకేతంగా నిలుస్తోందని పేర్కొంది.