భయం గుప్పిట్లో భద్రాద్రి ఏజెన్సీ

భయం గుప్పిట్లో భద్రాద్రి ఏజెన్సీ

జిల్లాలో అడుగుపెట్టిన మావోలు.

ఆదీవాసి సమస్యలే అస్త్రంగా పట్టు నిలుపుకునే వ్యూహం

రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్.

నివురు గప్పిన నిప్పులా భద్రాద్రి ఏజెన్సీ

మావోయిస్టుల గురించి సమాచారం ఇస్తే 5 లక్షల బహుమతి ప్రకటన చేసింది తెలంగాణ పోలీస్. ఇన్నాళ్లూ చత్తీస్ ఘఢ్ దండకారణ్యంకే పరిమితమైన మావోయిస్టులు తెలంగాణ సరిహద్దు అడవుల్లోకి ఎంటర్ అయ్యారు. ప్రశాంతంగా ఉన్న భద్రాద్రి ఏజెన్సీలో మళ్లి దాడులకు సిద్దం ఆవుతున్నారు. మావోల విస్తరణ కు అడ్డుకట్ట వేయాలని తెలంగాణ పోలీస్ రంగం లోకి దిగింది. ఓ పక్క మావో లు మరోపక్క పోలీస్ బలగాలతో భద్రాద్రీ ఏజెన్సీ వార్ జోన్ గా మారింది.

మావోయిస్టు నేతలు హరిబూషన్, దామోదర్, భద్రు, మంగు, రాజీ రెడ్డి నేతృత్వంలో 40 మంది మావోయిస్టులు కరకగూడెం, గుండాల, బయ్యారం, మణుగూరు మండలాల పరిధిలో తిరుగుతున్నారని సమాచారం. అక్కడి ఆదివాసీలను పోడు భూమూల ఉద్యమంతో తమ వైపు తిప్పుకొని కదన రంగం లోకి దూకాలనే యోచనలో ఉన్నారు.

ఏజెన్సీలో వీరి కదలికలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా sp సునీల్ దత్ అనుమానిత మావోయిస్టు ఫొటోలను మీడియా కు విడుదల చేశారు. పోస్టర్ లను ఏజెన్సీ గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. మావోయిస్టుల సమాచారం చెప్పిన వారికి 5 లక్షల బహుమతి ఇస్తామని ప్రకటన చేశారు.