పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు శారదక్క

పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు శారదక్క

వరంగల్ జిల్లా: మావోయిస్టు శారదక్క పోలీసులకు లొంగిపోయింది. మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి  దివంగత యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ భార్యే ఈ శారదక్క. మావోయిస్టు పార్టీ చర్ల, శబరి ఏరియా కమిటీ మెంబర్ గా, డి సి ఎం కమిటీ మెంబర్ గా కొనసాగుతున్న శారదక్క ఆదివారం డీజీపీ  ముందు లొంగిపోయింది. శారదక్క స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెం గ్రామం.