పోలీసులకు, మావోస్టులకు మధ్య ఎదురు కాల్పులు

పోలీసులకు, మావోస్టులకు మధ్య ఎదురు కాల్పులు

మహారాష్ట్రలో పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు హతమైంది. గడ్చిరోలి జిల్లా కపేవాన్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆమె మృతదేహం వద్ద 8 ఎంఎం రైఫిల్‌తో పాటు భారీ మొత్తంలో మావోయిస్టుల సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

సి-60 పోలీసులు యాంటీ నక్సలైట్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మహిళా మావోయిస్టు  చనిపోయింది. మరోవైపు అహేరీ, పెర్మిలి దళాలకు చెందిన 30 నుండి 40 మంది మావోయిస్టులు అడవిలో సంచరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గడ్చిరోలి జిల్లా విలీన వారోత్సవాల్లో రెండు దళాలు పాల్గొన్నట్లు సమాచారం. రాజారాం (ఖాన్) పరిధిలోని మౌజా కపెవన్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమైనట్లు తెలుస్తోంది. అటు పోలీసులను చూడగానే కొందరు మావోయిస్టులు దట్టమైన అడవిలోకి పారిపోయారని చెబుతున్నారు. వారి కోసం C60 పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇక అక్టోబర్ 2020 నుండి మొత్తం 55 మంది మావోయిస్టులు మరణించగా.. 46 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 19 మంది నక్సలైట్లు లొంగిపోయినట్టు పోలీసులు ప్రకటించారు.