2019 వరల్డ్ కప్ ఫైనల్లో చాలా పెద్ద తప్పు చేశాం : ఎరాస్మస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

2019 వరల్డ్ కప్ ఫైనల్లో చాలా పెద్ద తప్పు చేశాం : ఎరాస్మస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: నరాలు తెగే ఉత్కంఠ మధ్య, వివాదాస్పద రీతిలో సాగిన 2019 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో  బౌండరీ కౌంట్ ఆధారంగా న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించి ఇంగ్లండ్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. అయితే, ఆ ఫైనల్లో  తాము చాలా పెద్ద తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టు  మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫీల్డ్ అంపైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించిన ఎరాస్మస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వెల్లడించాడు. ఛేజింగ్‌‌‌‌లో 50వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాలుగో బంతికి కివీస్ ఫీల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గప్టిల్ విసిరిన త్రోకు బంతి స్టోక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తగిలి బౌండ్రీకి వెళ్లింది.

 ఫీల్డ్ అంపైర్లు ఎరాస్మస్, కుమార ధర్మసేన ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్రో బౌండ్రీ, డబుల్ కలిపి మొత్తం ఆరు రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. అయితే, గప్టిల్ త్రో చేసే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెండో రన్‌‌ కోసం ఇరువురు బ్యాటర్లు క్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవ్వలేదన్న విషయాన్ని గుర్తించి ఉంటే ఐదు రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే లభించేవని ఎరాస్మస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పాడు. ఫైనల్ మ్యాచ్ తర్వాతి రోజు హోటల్లో ధర్మసేన  చెప్పే వరకూ ఈ తప్పిదాన్ని  తాను గుర్తించలేదన్నాడు. అదే మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కివీస్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టేలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎల్బీగా ఔటివ్వడం కూడా తన తప్పిదమేనని ఒప్పుకున్నాడు.