ఏఐఎస్ జీఈఎఫ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా మారం జగదీశ్వర్

ఏఐఎస్ జీఈఎఫ్  నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా మారం జగదీశ్వర్

హైదరాబాద్, వెలుగు: అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ( ఏఐఎస్ జీఈఎఫ్) జాతీయ ఉపాధ్యక్షుడిగా టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రెసిడెంట్, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా టీఎన్జీవో జనరల్ సెక్రటరీ ముజీబ్ హుస్సేన్, అసోసియేట్ అధ్యక్షుడిగా కస్తూరి వెంకటేశ్వర్లు, కోశాధికారిగా ముత్యాల సత్యనారాయణ గౌడ్ లు ఎన్నికయ్యారు. 

ఆదివారం  షిరిడీలో అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య 18వ జాతీయ సమావేశాల్లో ఈ ఎన్నిక జరిగింది. ఈ నెల 23న సమావేశాలు స్టార్ట్ కాగా 26న ముగియనున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న 28 రాష్ట్రాల ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. దేశంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఈ సమావేశంలో చర్చించి వాటి పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు చేయాలని తీర్మానాలు చేశారు.