
ఒక ప్రముఖ నటుడు తన తల్లికి రెండో పెళ్లి చేశారు. ప్రస్తతం న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరాఠీ సినిమాల్లో కనిపించే ప్రముఖ నటుడు సిద్దార్థ్ చందేకర్( Siddharth Chandekar ). ఈ యువ నటుడు తీసుకున్న గొప్ప నిర్ణయానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇటీవలే ఈ హీరో తన తల్లికి రెండో పెళ్లి చేశాడు. దానికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ వాళ్ళ అమ్మ గురించి ఇలా రాసాడు.
అమ్మా.. హ్యాపీ సెకండ్ ఇన్నింగ్స్. నీ బిడ్డలతో పాటు నీకు కూడా స్వతంత్రమైన అందమైన ప్రపంచం ఉంది. నువ్వు ఇప్పటివరకు మాకోసం చాలా త్యాగం చేశావు.ఇప్పుడు మీ గురించి, మీ కొత్త భాగస్వామి గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది.ఈ విషయంలో మీ పిల్లలు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. నువ్వు నా పెళ్లిని ఎంతో గ్రాండ్ గా చేశావు.. ఇప్పుడు నేను అదే పని చేస్తున్నానని రాసుకొచ్చాడు సిద్దార్థ్ చందేకర్.