జొహన్నెస్‌బర్గ్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా నిలకడగా ఆడుతోంది. మార్కస్ అకెర్‌మన్ (157) భారీ సెంచరీ చేయడంతో.. సోమవారం రెండో రోజు ఆట ముగిసే టైమ్‌కు సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 62 ఓవర్లలో 287/4 స్కోరు చేసింది. కెప్టెన్ టెంబా బావుమా (19 బ్యాటింగ్), రైన్ రికెల్టన్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
ఐదు రన్స్ వద్ద మార్‌క్రమ్ (4) ఔటైనా.. అకెర్‌మన్, హమ్జా (83) రెండో వికెట్‌కు 202 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. అంతకుముందు 327/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 101.2 ఓవర్లలో 400 రన్స్‌కు ఆలౌటైంది. తౌహిద్ హ్రిదోయ్ (137), లిటన్ దాస్ (120) సెంచరీలు చేశారు. రబాడ 5 వికెట్లు పడగొట్టాడు.
