
ముంబయి ఇండియన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో లక్నో జట్టు భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో 20 ఓవర్లలో 178 పరుగులు చేసింది. ఓపెనర్లు దీపక్ హుడా (5), ప్రేరక్ మన్కడ్ (0) త్వరత్వరగానే ఔట్ కాగా కృనాల్ పాండ్య (49), స్టాయినిస్ (89)పరుగులతో విధ్వంసం సృష్టించారు.
ఇద్దరు కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి లక్నో జట్టుకు భారీ స్కోర్ ను అందించారు. ముఖ్యంగా స్టాయినిస్ 18 ఓవర్లో రెచ్చిపోయాడు. 6,0,4,4,6,4 కొట్టి ఒకే ఓవర్ లో 24 పరుగులు రాబట్టాడు. ఇక ముంబయి బౌలర్లలో బెహ్రీన్ డూర్ఫ్2, పీయూష్ చావ్లా ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై 14 పాయింట్లతో మూడవ స్థానంలో ఉండగా, లక్నో 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.