20వేలు ఇస్తేనే భూమి నీ పేరిట రాసిస్తా..

 20వేలు ఇస్తేనే భూమి నీ పేరిట రాసిస్తా..
  • లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన మరికల్ తహశీల్దార్ 

నారాయణపేట: రైతు భూమిని అతనిపేరిట రాసిచ్చేందుకు 20వేలు లంచం అడిగిన తహశీల్దార్.. అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయారు. రైతు వద్ద నుంచి 20 వేలు లంచం డబ్బులు తీసుకున్న వెంటనే ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 
జిల్లాలోని పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన రైతు భూమిని అతని పేరిట రాసిచ్చేందుకు మరికల్ తహసిల్దార్ శ్రీధర్ లంచం డిమాండ్ చేశారు. మొదట పెద్ద మొత్తం అడిగినా అంత ఇచ్చుకోలేనని బేరమాడడంతో చివరకు 20 వేలు తీసుకునేందుకు అంగీకరించారు.  తాహశీల్దార్ వేధింపులతో విసిగిపోయిన రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మరకు ఇవాళ లంచం డబ్బుతో తహశీల్దార్ కార్యాలయానికి వచ్చి అందజేసిన కాసేపటికే ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. మరో బృందం ఏసీబీ అధికారులు తహశీల్దార్ ఇంట్లో సోదాలు చేపట్టారు. అక్రమ సంపాదన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

 

 

 

ఇవి కూడా చదవండి

ఏపీలో 10వేలు దాటిన కరోనా కేసులు..

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కీలక ప్రకటన

ప్రగతి భవన్ వద్ద జేసీ దివాకర్ రెడ్డి హల్చల్