
విశాల్, ఎస్.జె.సూర్య లీడ్ రోల్స్‌లో అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన చిత్రం ‘మార్క్ ఆంథోని’. సునీల్ కీలకపాత్ర పోషించాడు. ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి పాజిటిక్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ‘ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ చెప్పిన విశాల్.. ఈ చిత్రానికి తెగిన ప్రతీ టికెట్ నుంచి ఒక రూపాయి రైతులకు ఇస్తాను’ అని అన్నాడు.