ప్రవల్లిక తల్లిదండ్రులకు .. ప్రియాంకాగాంధీ పీఎస్ ​పరామర్శ

ప్రవల్లిక తల్లిదండ్రులకు .. ప్రియాంకాగాంధీ పీఎస్ ​పరామర్శ

నర్సంపేట / నల్లబెల్లి, వెలుగు : ఆత్మహత్య చేసుకున్న మర్రి ప్రవల్లిక కుటుంబాన్ని కాంగ్రెస్​ జాతీయ నాయకురాలు ప్రియాంకగాంధీ పర్సనల్​ సెక్రటరీ, ఏఐసీసీ అధికార ప్రతినిధి డాలీ శర్మ, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో కలిసి ఆదివారం పరామర్శించారు. సాయంత్రం బిక్కాజుపల్లికి చేరుకున్న డాలీ శర్మ.. ప్రవల్లిక తల్లిదండ్రులు మర్రి లింగయ్య, విజయతో మాట్లాడారు. ప్రవల్లిక ఆత్మహత్య ​చేసుకున్న విషయం తెలుసుకున్న ప్రియాంకగాంధీ తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారని చెప్పారు. ఆమె ఫ్యామిలీకి కాంగ్రెస్​ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చి రమ్మన్నారని తెలిపారు.

ఇదే సమయంలో  పీసీసీ చీఫ్ ​రేవంత్​రెడ్డి దొంతి మాధవరెడ్డికి ఫోన్​చేశారు. తర్వాత ప్రవల్లిక తల్లిదండ్రులతో రేవంత్​రెడ్డి ఫోన్​లో మాట్లాడి ధైర్యం చెప్పారు. అధైర్యపడొద్దని, కాంగ్రెస్ ​పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ ​పార్టీ నాయకులు తక్కళ్లపల్లి రవీందర్​రావు, సొంటిరెడ్డి రంజిత్​రెడ్డి, తోకల శ్రీనివాస్​రెడ్డి, ఎర్రోళ్ల బాబు, వేముల సాంబయ్య ఉన్నారు.