సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడి వివాహం

V6 Velugu Posted on Oct 12, 2021

ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు.మహతి స్వరసాగర్ వివాహం సింగర్ సంజనా కలమంజేతో ఈ నెల 24న జరగనుంది. ఉదయం 10.30 గంటలకు చెన్నై టీ-నగర్ లోని అకార్డ్ ఫంక్షన్ హాల్లో ఈ సెలబ్రిటీ పెళ్లి జరగనుంది.  ఆ తర్వాత  ఈ నెల 29న హైదరాబాదు గోల్కొండ రిసార్ట్ లో ఘనంగా రిసెప్షన్ నిర్వహించనున్నారు.

సంజన కలమంజేతో మహతి స్వరసాగర్‌కు ఇటీవల ఘనంగా నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు కుటుంబసభ్యులు, కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. 'ఛలో', 'భీష్మ,' 'మాస్ట్రో'  సినిమాలకు  స్వరసాగర్‌ సంగీతమందించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.  గాయని సంజన కలమంజే 'భీష్మ' చిత్రంలో 'హేరు చూసా' అనే పాటను పాడారు. ఆమె టాలీవుడ్‌లోనే కాదు.. కోలీవుడ్‌, శాండిల్‌వుడ్‌ సినిమాలలో పాటలు పాడి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సంజనా కలమంజే స్వస్థలం కర్ణాటకకు చెందిన ఉడుపి. వీరి కుటుంబం చెన్నైలో స్థిరపడింది.

Tagged music director, Son Marriage, Mani Sharma

Latest Videos

Subscribe Now

More News