మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని ఏళ్ళక్కపేట గ్రామంలో దారుణం జరిగింది. చల్ల శారద (24) అనే వివాహితను అతి కిరాతకంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో విచారిస్తు్న్నారు. మరోవైపు శారద హత్యతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
శారదను హత్య చేసిన దుండగులు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారని.. నిందితులను తమకు అప్పగించాలంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు చెన్నూర్ పోలీస్ స్టేషన్‌పై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డట్లు సమాచారం. దీంతో పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా.. అధికారులు రంగంలోకి దిగి ఆందోళనకారులను శాంతింపజేశారు.
