కోల్ బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదివారం మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, కోటపల్లి మండలాల్లో జరిగిన పెద్దమ్మ, పోచమ్మ బోనాల్లో పాల్గొన్నారు. కిష్టంపేట, సర్వాయి పేట గ్రామాల్లో కాంగ్రెస్ లీడర్లతో కలిసి పూజలు చేశారు. జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని మై ఫంక్షన్ హాల్ లో జరిగిన దివ్య-, నిరంజన్ గౌడ్ వివాహానికి మంత్రి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఇటీవల కాంగ్రెస్ నుంచి కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన సయ్యద్ సాహిత్ అహ్మద్, ఖాజా బేగం మహమ్మద్, సాధనబోయిన కృష్ణ, తనుగుల సరోజనకు నియామకపత్రాలను అందజేశారు. అంతకుముందు కోటపల్లి మండలం శంకరాపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన మండల పార్టీ అధ్యక్షుడు కాట్రాల మల్లయ్య మామ ఉడుత బత్తయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి వెంట మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ ఉన్నారు.
బాధితురాలికి పరామర్శ
గోదావరిఖని: రామగుండం ప్రాంతానికి చెందిన జర్నలిస్ట్ కాసం హరిప్రసాద్ తల్లి అమృత అనారోగ్యంతో హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా, రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదివారం హాస్పిటల్కు వెళ్లి ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పారు. హాస్పిటల్ చైర్మన్తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
