కాగజ్‌నగర్, వెలుగు: కుమ్రభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండలం దుబ్బగూడలో ఆదివారం అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గతంలో పులి దాడిలో గాయపడి కోలుకున్న దుబ్బగూడ గ్రామానికి చెందిన సురేశ్ తో కాగజ్‌నగర్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్(ఎఫ్‌డీవో) అప్పయ్య ప్రత్యేకంగా మొక్కలు నాటించారు.
అనంతరం పులి దాడి జరిగిన సమయంలో ఎదురైన పరిస్థితి, ప్రస్తుతం అతని ఆరోగ్యం గురించి ఎఫ్‌డీవో ఆరా తీశారు. ప్లాంటేషన్ లో పని చేస్తున్న కూలీలకు రెయిన్ కోట్లు అందించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని, ప్రకృతి రక్షణ అందరి బాధ్యత అని అన్నారు. రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, సెక్షన్ ఆఫీసర్ వల్క మోహన్ రావు పాల్గొన్నారు.
