
కుంటాల, వెలుగు: వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ అశోక్ కథనం మేరకు.. కుంటాల మండల కేంద్రానికి చెందిన షికారి పోశెట్టి భార్య ఏడాది కింద చనిపోయింది. అతనికి కొన్నాళ్ల కింద మామడ మండలం పోన్కల్కు చెందిన వివాహిత స్రవంతి(18)తో పరిచయం కాగా సహజీవం చేస్తున్నారు. వీరికి మూడు నెలల కింద పాప పుట్టింది. అయితే.. స్రవంతి భర్త ఉపాధి కోసం విదేశానికి వెళ్లి 20 రోజుల కింద తిరిగి సొంతూరుకు వచ్చాడు. భార్యను విడాకులు ఇవ్వాలని కోరుతూ కుల సంఘంలో పంచాయితీ పెట్టాడు.
దీంతో తల్లిదండ్రులు తమ కూతురిపై ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు పోశెట్టి, స్రవంతి మధ్య గొడవలు జరుగుతుండగా, మనస్తాపం చెంది ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. పోశెట్టిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదనపు కట్నం కోసం పోశెట్టి తమ కూతురిని వేధిస్తుండడంతోనే ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.